సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీల అభివృద్ధి మరింత సాధ్యం ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ని కలిసిన నూతన సంక్షేమ సంఘం సభ్యులు.
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 3 (వాస్తవ తెలంగాణ)కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని చెరుకుపల్లి కాలనీ ఫేస్ - 2 వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ని తన నివాసం వద్ద సభ్యులందరూ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతు కాలనీల సంక్షేమ సంఘాల ఐక్యతతో అభివృద్ధి మరింత వేగంగా సాధ్యం అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కాలనీలో ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ వెంకటేష్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, అడ్వైసర్లు క్రిస్ట్ దాస్, నర్సింహా రెడ్డి, జాయింట్ సెక్రటరీలు రాధా, మనోరమ,లావణ్య,స్వరూప. అనసూయ కాలనీ వాసులు నార్లకంటి రమేష్, ఎం శ్రీనివాస్,అజయ్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments