జి యస్ యమ్ టీం ను అభినదించిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి.
నర్సాపూర్,వాస్తవ తెలంగాణ// మెదక్ జిల్లా నర్సాపూర్ మండలపరిధిలోని రాంచంద్రపూర్ గ్రామ సర్పంచ్ శ్రీశైలం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు.ఈ టోర్నమెంట్ లో 33 జట్లు తలపడగా శివంపేట మండలం పెద్ద గొట్టిముక్కల గ్రామానికి చెందిన జి యస్ యమ్
కెప్టెన్ గుండా సురేష్ టీం ఘన విజయం సాధించింది.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి,రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత రెడ్డి లు హాజరై వారి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు.మొదటి బహుమతిగా జి యస్ యమ్ టీం కు 33,333 రూపాయల నగదు బహుమతితో పాటు మెడల్స్ అందజేశారు.అదేవిధంగా రన్నర్ విజేతగా నిలిచిన తల్వార్ టీంకు 15,555 రూపాయల నగదుతో పాటు మెడల్స్ అందజేశారు.అనంతరం ఎమ్మెల్యే మదన్ రెడ్డి,మహిళ కమిషన్ చైర్పర్సన్ సునీత రెడ్డి లు మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనడం ఎంతో ముఖ్యమని, గెలుపు ఓటములు సర్వసాధారణమని అన్నారు.రానున్న రోజుల్లో ఇలాంటి టోర్నమెంట్లు మరెన్నో జరగాలని కోరారు. దానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.మొదటి బహుమతి సాధించిన జి యస్ యమ్ టీం తో పాటు కెప్టెన్ గుండా సురేష్ ని ఎమ్మెల్యే మదన్ రెడ్డి,రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత రెడ్డి లు అభినందించారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి బాబ్యా నాయక్,మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్,వైస్ చైర్మన్ అబీబ్ ఖాన్, వైస్ ఎంపీపీ వెంకట నర్సింగరావు, మండల పార్టీ అధ్యక్షులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments