Wanted Reporters

Wanted Reporters

జిల్లాలో కాళేశ్వరం పనులకు సంబంధించి భూసేకరణ వేగవంతంగా పూర్తి చేయాలి సమీక్ష సమావేశంలో మెదక్​ జిల్లా అదనపు కలెక్టర్​ రమేష్​.

 జిల్లాలో కాళేశ్వరం పనులకు సంబంధించి భూసేకరణ వేగవంతంగా పూర్తి చేయాలి

సమీక్ష సమావేశంలో మెదక్​ జిల్లా అదనపు కలెక్టర్​ రమేష్​

(మెదక్ వాస్తవ తెలంగాణ ప్రతినిది ):-మెదక్​ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు సంబంధించి భూసేకరణ, సర్వే తదితర పనులను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదని మెదక్​ జిల్లా అదనపు కలెక్టర్​ రమేష్​ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్​లోని సమావేశ మందిరంలో జిల్లాలోని నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్​ రమేష్​  కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతి, భూసేకరణ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మెదక్​ జిల్లా ప్రాంత ప్రజలకు కాళేశ్వరం నీటిని అందించేందుకు పనులు చేపడుతున్నందున ఆయా ప్రాంతాల్లో ఇప్పటి వరకు అవసరమున్న భూమికి ఎంత భూమిని సేకరించారని అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లో భూసేకరణ జరగకపోవడం, ఇతర ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించి వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు అదనపు కలెక్టర్​ రమేష్​  సూచించారు. అలాగే సర్వే పనులు సైతం ఇంకా పూర్తి కాలేదని ఆ పనులను కూడా వెంటనే పూర్తి చేసి పూర్తి నివేదికను అందచేయాలన్నారు.  ప్రభుత్వం సూచించిన పనుల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదని వెంటనే పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా సర్వే అధికారి గంగయ్య, మెదక్​, తూప్రాన్​, నర్సాపూర్​ ఆర్డీవోలు సాయిరామ్​, శ్యాంప్రకాశ్​, వెంకట ఉపేందర్ రెడ్డి​, నీటి పారుదల శాఖ అధికారులు, రెవెన్యూ శాఖల అధికారులు, ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code