పాదయాత్రను ప్రారంభించిన పులిమామిడి రాజు
సంగారెడ్డి జిల్లా వాస్తవ తెలంగాణ న్యూస్ ఫిబ్రవరి /03:సదాశివపేట పట్టణం కృష్ణానగర్ కాలనీ (6 వ వార్డు) నుండి 02/02/2022 నాడు శ్రీశైల పుణ్య క్షేత్రానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లనున్న శివ భక్తులను బుధవారం జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు 12 వార్డ్ కౌన్సిలర్ పులిమామిడి రాజు ప్రారంభించారు ఈ సందర్భంగా శివ భక్త బృందం బాధ్యతలు చిప్ప నాగప్ప మాట్లాడుతూ కౌన్సిలర్ పులిమామిడి రాజు ఆర్థిక సహాయంతో శ్రీశైలం పాదయాత్ర బృందానికి ఆటో వాహనాలపై సౌకర్యం భోజన సదుపాయాలు వంటి అవసరాలకు ఆర్థిక సహాయం అందజేయడం ఎంతో అభినందనీయం అన్నారు కరోనా మహమ్మారి నుండి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మహా పాదయాత్ర ను చేపట్టినట్టు చిప్ప నాగప్ప పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రామస్వామి ,రాములు, రాఖి భక్త బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు
0 Comments