నిరుపేద కుటుంబాలకు అండగా సీఎం కేసీఆర్
గజ్వేల్ వాస్తవతెలంగాణన్యూస్:- సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామానికి చెందిన వడ్ల పద్మకు, షెగ్గరి ఇంద్రకు, సీఎం సహాయనిధి నుండి రెండు కుటుంబాలకు కలిపి 45000,50000, చెక్కులను గురువారం రోజున గజ్వేల్ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ మాదాసు అన్నపూర్ణ అందచేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం సీఎం సహాయ నిధి కింద చికిత్స కోసం ఆర్ధిక సహాయం అందిస్తుందని,సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు, ఆపద సమయంలో వైద్య ఖర్చుల కోసం బాధిత కుటుంబాలకు సీఎం కేసీఆర్ అందజేస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయని అన్నారు,4 లక్షల మంది వైద్యానికి 2 వేల కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి నిరుపేద కుటుంబాలకు అందాయని వారన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేవలం పదేండ్లలో 1.85 లక్షల మందికి 750 కోట్లు అందాయని వారన్నారు, పార్టీలకు అతీతంగా ప్రభుత్వం సీఎం సహాయ నిధి చెక్కులను అందిస్తుందని, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ చాడ నవీన శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, మాజీ కో ఆప్షన్ అహ్మద్, గ్రామ పార్టీ అధ్యక్షుడు నిజమోద్దీన్, వార్డు సభ్యుడు బుచ్చిరెడ్డి, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు..
0 Comments