సింగిల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
పటాన్ చెరు,వాస్తవ తెలంగాణ న్యూస్:
పటాన్ చెరులోని రామేశ్వరం బండలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించబడి నిరుపయోగంగా ఉన్న జెఎన్ఎన్యుఆర్ఎం సింగిల్ బెడ్రూం ఇళ్లను మంగళవారం శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి లాటరీ పద్ధతిలో అర్హులైన వారికి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీరుపేదల సొంతింటి కలను సాకారం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం డబల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తుంది, దానితో పాటు జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ పథకం క్రింద నిర్మించిన సింగిల్ బెడ్రూం ఇళ్లను 05/10/ 2021 నాడు మొదటి విడతలో పటాన్చెరు ప్రాంతం వారికి
192 ఇళ్లను పంపిణీ చేయడం జరిగింది, మిగిలిన ఇళ్లను మంగళవారం అర్హులైన వారికి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
0 Comments