కొల్గుర్ గ్రామం నుండే దళిత బంధు ప్రారంభం:- ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి., ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి
గజ్వేల్ వాస్తవ తెలంగాణ:- గజ్వేల్ మండలంలోని కొల్గురు గ్రామంలో తెలంగాణ దళిత బంధు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ,ఎప్ డి సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కోల్గురు గ్రామం పై ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి కొల్గురు గ్రామంలో ప్రతి ఒక్కరికి దళిత బంధు అమలు చేసే విధంగా కృషి చేస్తున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళితుల అభ్యున్నతికి దళితుల అభివృద్ధికి నిరంతరంగా నిర్విరామంగా కృషి చేస్తున్న రాజనీతిజ్ఞుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు,గజ్వేల్ నియోజకవర్గంలో 174 గ్రామాలలో కొల్గురు గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని దానిలో భాగంగానే కోల్గురు గ్రామానికి దళిత బందు కార్యక్రమాన్ని మంత్రి హరీష్ రావు సహకారంతో తీసుకు రావడం జరిగిందన్నారు, గత 70 సంవత్సరాల కాలంలో ఎంతోమంది ప్రధాన మంత్రులు మారిన ముఖ్యమంత్రులు మారినా దళితుల యొక్క తల రాతలు మారలేదని అన్నారు,ఇప్పుడు కేంద్రంలో ఉన్న బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం దళితుల పట్ల ఆలోచించడం లేదన్నారు,
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత ప్రభుత్వాలు వలన దళితులు అనాదిగా అణచివేతకు గురవుతున్న సాంప్రదాయాలను పెట్టాలనే ఉద్దేశంతో, దళితవాడలలో ఉన్న ఉన్నబాధలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల జీవితాలలో వెలుగులు నింపడానికి, దళితులను అన్ని రంగాలలో ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి, దళితుల అభివృద్ధికి, దళితుల అభ్యున్నతికి దళితుల యొక్క తలరాతలు మారే విధంగా దళితుల కోసం దళిత బందు పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకు వచ్చారన్నారు, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకం లేదన్నారు, కెసిఆర్ ఏ నిర్ణయం తీసుకున్న చారిత్రాత్మకం అన్నారు, అందులో భాగంగానే బుధవారం కొల్గుర్ గ్రామంలో దళిత బందు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారన్నారు, కొల్గురు గ్రామంలో ఉండే ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఇస్తారన్నారు, ఈ పది లక్షల రూపాయలతో దళితులు తమకు నచ్చిన విధంగా,తాము అభివృద్ధి చెందే విధంగా వ్యాపారాలు చేసుకోవచ్చు అన్నారు, ముఖ్యమంత్రి కెసిఆర్ గారు కల్పించిన ఈ అవకాశాన్ని దళితులు విజయవంతంగా సద్వినియోగం చేసుకొని జీవితంలో మరింతగా ఆర్థికంగా ఎదగాలని వారు కోరారు, తెలంగాణ రాష్ట్రంలోని 20లక్షల కుటుంబాలకు దళిత బందును ముఖ్యమంత్రి ఇస్తారన్నారు,
39 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న దేశవ్యాప్తంగా దళితులకు బిక్షం వేసినట్టుగా 12 వేల కోట్లు మాత్రమే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టిందన్నారు, ఇది చాలా సిగ్గుచేటని విమర్శించారు ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈసారి బడ్జెట్లో దళితుల అభివృద్ధి గురించి 25 వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రవేశపెట్ట పోతున్నారని అన్నారు, దళితుల అభివృద్ధికి దళిత అభ్యున్నతికి కెసిఆర్ గారు కంకణబద్ధులై పనిచేస్తున్నారన్నారు, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గొప్పదా,తెలంగాణ రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం గొప్పదా,ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు
కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని బిజెపి నాయకులు కళ్ళు లేని కబోదుల్లగా, పచ్చి అబద్ధాలు చెప్పు పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ నాయకుల పై మండిపడ్డారు,
భారత దేశంలో మోడీ మార్క్ డెవలప్మెంట్ ఏమిటని ప్రశ్నించారు,అన్ని ప్రైవేటీకరణ చేస్తూ భారతదేశంలోని అతిపెద్ద సంస్థలైన ఎల్ ఐ సి లాంటి సంస్థలను అమ్మటం సిగ్గుచేటని విమర్శించారు,స్వతంత్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వాలు మారినా పెద్దపెద్ద సంస్థలను ఎవరు అమ్మకానికి పెట్టలేదన్నారు,
ఇప్పుడున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం పెద్ద సంస్థలను అమ్మడం చూస్తుంటే చరిత్రహీనులుగా మారి చరిత్రలో నిలిచిపోతారు ఎద్దేవా చేశారు,ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, ఎంపీపీ దాసరి అమరావతి, జడ్పిటిసి పంగ మల్లేశం, స్థానిక సర్పంచ్ మల్లం రాజు, ఎంపిటిసి జ్యోతి ,ఎంపీటీసీ జ్యోతి స్వామి, ఆర్ డి ఓ విజయేందర్ రెడ్డి, తెరాస నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
0 Comments