జవహర్ నగర్ లో 33.05 కోట్ల తో అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్, పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి
జవహర్ నగర్, వాస్తవతెలంగాణ న్యూస్: జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ కలిసి పర్యటించడం జరిగింది. కార్పొరేషన్ పరిధిలో 33.05కోట్ల రూపాయలతో హైదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో ఓఆర్ఆర్ ఫేస్ 2 త్రాగునీటి సరఫరా కోసం చేపట్టే పనులకు, రోడ్డు విస్తరణ చెన్నాపురం చెరువు సుందరీకరణ పనులకు మంత్రి శ్రీ కేటీఆర్ కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. మంత్రి మల్లా రెడ్డి మాట్లాడుతూ 58,59 జీవో అమలు చేయాలనీ కేటీఆర్ ను కోరారు. అనంతరం రోడ్ల విస్తీర్ణ జవహర్ నగర్ అభివృద్ధికై శంకుస్థాపన చేయడం జరిగినది. జీవో 58,59, వెంటనే తీసుకువస్తాం..ప్రభుత్వ భూముల్లో 60.70,80 గజల్లో గుడిసెలు, ఇండ్లు కట్టుకున్న వారికి అండగా ఉంటాం. పేద ప్రజలకు అండగా ఉండటమే సి ఏం కేసీఆర్ ప్రభుత్వం లక్ష్యం. జవహర్ నగర్ కార్పొరేషన్లలో నెల రోజుల్లో జీవో 58,59 అమలు చేసి పేదవారికి యాజమాన్య హక్కులు కల్పించి మళ్ళీ వచ్చి పట్టలిస్తాం.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ నవీన్ కుమార్,జడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ తెరాస పార్టీ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి,జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి కావ్య,డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు, కో అప్షన్ సభ్యులు,మరియు మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
0 Comments