అర్ధరాత్రి అక్రమ అరెస్టులా?
కేటీఆర్ పర్యటన సందర్భంగా నిర్బంధం సిగ్గుమాలిన చర్య కాంగ్రెస్ నేత శ్రీకాంత్ యాదవ్ ఫైర్
జవహర్ నగర్, వాస్తవతెలంగాణ న్యూస్: పోలీసుల పహారా మధ్య మంత్రి కేటీఆర్ జవహర్ నగర్ లో పర్యటించడాన్ని జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ తీవ్రంగా ఖండించారు.
మంత్రి పర్యటన సందర్భంగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలలో భాగంగా పలు సమస్యలను పరిష్కరించాలని కోరితే అర్ధరాత్రి నుంచి అక్రమంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం ప్రభుత్వ సిగ్గుమాలిన చర్యగా విస్తున్నామన్నారు. కేటీఆర్ జవహర్ నగర్ పర్యటనలో ప్రసంగంలో కొత్తధనం లేదని పాత సీసాలో కొత్త మందు అన్న విదంగా ఉన్నదన్నారు. కేటీఆర్ రాక సందర్భంగా పలు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని జవహర్ నగర్ ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూశారని వారి ఆశలు నిరాశగా మార్చన్నారు. జవహర్ నగర్ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటాలను ఉదృతం చేస్తామన్నారు.
0 Comments