ఘనంగా మార్కండేయ జయంతి
గజ్వేల్ వాస్తవ తెలంగాణన్యూస్:- మార్కండేయ దేవాలయం లో మార్కండేయ స్వామి జయంతి సందర్భంగా గురువారం రోజున ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు, ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి , ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి , మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నే దేవాలయాల అభివృద్ధి జరుగుతుందని వారన్నారు.ఈ కార్యక్రమంలో రామకోటి రామరాజు, డాక్టర్ నరేష్ బాబు, దొంతుల ప్రభాకర్, తలకొక్కుల దుర్గాప్రసాద్, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు..
0 Comments