గజ్వేల్ లో నేషనల్ లెవెల్ కరాటే ఫ్రీ సెమినార్
గజ్వేల్ వాస్తవ తెలంగాణ :- గజ్వేల్ పట్టణంలోని లక్ష్మణ్ ఫంక్షన్ హాల్ లో జాతీయస్థాయి కరాటే ఫ్రీ సెమినార్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ చైర్మన్ యన్ సి రాజమౌళి హాజరయి కరాటే లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత కరాటేలో శిక్షణ పొంది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కరాటే విద్య ద్వారా ఆత్మ విశ్వాసం కలుగుతుందని చిన్నారులను కరాటే శిక్షణకు పంపిస్తున్న చిన్నారుల తల్లి తండ్రులని అభినందించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ గోపాల్ రెడ్డి , అల్వాల బాలేష్, రహీమ్, తెరాస నాయకులు దుర్గ ప్రసాద్, సమీర్, శివ కుమార్, మల్లేశం, కరాటే అసోసియేషన్ ఇండియా చీఫ్ ఎండి జాంగిర్, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ సాయి కుమార్, సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ చీఫ్ నవీన్, సీనియర్ ఇన్స్పెక్టర్ డి కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
0 Comments