ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
జవహర్ నగర్, ఫిబ్రవరి 6వాస్తవ తెలంగాణ ప్రతినిధి: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆర్మీ డెంటల్ కాలేజ్ ప్రక్కన రాజీవ్ గాంధీ నగర్ లో విరోమ్ హాస్పిటల్ వారి సౌజన్యంతో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ ఆద్వర్యంలో ఉచిత ఫ్రీ మెడికల్ క్యాంపు ఆదివారం దయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించారు. జనరల్ వ్యాధులకు ఉచితంగా చికిత్స లు జరిపి మందులు కూడా పంపిని చేశారు.ఈ కార్యక్రమంలో BSP బిర్రు యాకస్వామి (జవహర్ నగర్, కార్పొరేషన్ అధ్యక్షులు) గారు, బైరపాక జేసుదాసు చక్రవర్తి (అసెంబ్లీ కోశాధికారి) గారు, కానుగంటి వెంకటేశం (జవహర్ నగర్ కార్పొరేషన్, జనరల్ సెక్రెటరీ గారు), కొమ్ము ఆనంద్ (కాప్రా మండల కన్వీనర్ గారు), పరమేష్ గారు, కలకోట ప్రభాకర్ గారు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
0 Comments