Wanted Reporters

Wanted Reporters

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణకు అన్యాయం :-- యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్


- తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి


గజ్వేల్ వాస్తవతెలంగాణ :- కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి బడ్జెట్ కేటాయింపుల్లో  తెలంగాణ అభివృద్ధి విషయంలో తీవ్ర అన్యాయం చేస్తుందని సర్దార్ ఖాన్ అన్నారు,గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి విషయంలో పార్లమెంట్ లో  బయటగాని కేంద్ర ప్రభుత్వం చేసే ప్రతి దానికి పూర్తి మద్దతు పలికి ఇప్పుడు బిజెపికి కేంద్రంలో మేమే ప్రతిపక్షం మేమే కోట్లాడుతాం అని ప్రగల్భాలు పలుకుతూ ప్రధాని పదవి పై కన్ను వేసి మాట్లాడుతున్న వైనాన్ని యావత్ తెలంగాణప్రజలు గమనిస్తున్నారని వారు అన్నారు,కేంద్రంలోని బిజెపి చెప్పాపెట్టకుండా రాజ్యాంగాన్ని మాట్లాడుతుంటే బిజెపి విధానాన్ని సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు టిఆర్ఎస్ బుధవారం బహిరంగంగా రాజ్యాంగాన్ని మార్చుదాం అని చెప్పి బిజెపి విధానాలను అమలు చేసే బీటిమ్ గా టిఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందనివారు అన్నారు, తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్న బిజెపి పార్టీని తెలంగాణ వాదులంతా కలిసి నిలదీయాల్సిన అవసరం ఉందని అన్నారు,తెలంగాణ అభివృద్ధి కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమయంలో కొత్త రాష్ట్రాలకు ఇచ్చిన హామీల అమలు పర్చుటలో బిజెపి నాయకులు ,టిఆర్ఎస్ నాయకులు, పూర్తిగా వైఫల్యం చెందినారు.తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే తెలంగాణలో బిజెపి, టిఆర్ఎస్ పార్టీలను ఉండకూడదనివారన్నారు .తెలంగాణ రాష్ట్రంలో , కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన తెలంగాణ రాష్ట్రం బాగుపడుతది అని, యావత్ తెలంగాణ ప్రజలు గమనించి, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని బలపరచాలని ,తెలంగాణ ప్రజలపై బాధ్యత ఉందని వారన్నారు. ఈ కార్యక్రమంలో బాల గౌడ్, దుర్గి రాజు, అంజాత్, పోతగల మహేష్, సమీర్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code