కొమురవెల్లి, కొండపోచమ్మ దేవాలయాలను దర్శించుకున్న :- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
కొమురవెల్లి,జగదేవపూర్ వాస్తవతెలంగాణ న్యూస్: -
సిద్దిపేట జిల్లాలోని కొమురవెళ్లి మల్లన్న ను, కొండ పోచమ్మ అమ్మవారి ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న మంత్రి
తలసాని శ్రీనివాస్ యాదవ్ , వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నే దేవాలయాల అభివృద్ధి జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు, కొమురవెళ్లి ఆలయం వద్ద భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు, గతంలో ఎన్నడూ లేని విధంగా కొమురవెళ్లి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందిఅన్ని రహదారులఅభివృద్ధి,వసతికోసం కాటేజెస్,త్రాగునీటిసౌకర్యంతెలంగాణరాష్ట్రప్రభుత్వంకల్పించింది,కొండపోచమ్మఆలయఅభివృద్ధికోసం ముఖ్యమంత్రి 10 కోట్ల రూపాయలు మంజూరుచేశారుఅనిఅన్నారు,యాదాద్రినిర్మాణంఅద్భుతకళాఖండం,భద్రాచలం,వేములవాడదేవాలయాలను తెలంగాణ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తుంది.ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని.గత పాలకులు ప్రజల బాగోగులు పట్టించుకోలేదు అని, తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే విమర్శలు చేస్తున్నారు అని,74 ఏండ్ల గోస నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు విముక్తి లభించింది అని అన్నారు, తెలంగాణ రాష్ట్రం ఉందని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో మర్చిపోయిన దని, 74 ఏళ్ల లో జరగని అభివృద్ధి ,7 సంవత్సరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేసి చూపారని అన్నారు , కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ముఖ్యమంత్రితీసుకొచ్చారనిఅన్నారు ,ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి దేవాలయాల అభివృద్ధి చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
0 Comments