దొమడుగు ముదిరాజ్ సంఘం నూతన గ్రామ కమిటీ
గుమ్మడిదల, వాస్తవ తెలంగాణ న్యూస్:
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో నూతన ముదిరాజ్ గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముదిరాజ్ మండల అధ్యక్షులు గ్యారల మల్లేష్ ముదిరాజ్ చింతల వీరేష్ ముదిరాజ్, వెంకటేష్, నల్తూర్ యాదగిరి, తుజల్ పూర్ వీరేశ్, ఆధ్వర్యంలో కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది నూతన గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన శంకరయ్య, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, యువత విభాగం అధ్యక్షులు చింతల వెంకటేష్ ,ప్రధాన కార్యదర్శి సందీప్, మరియు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో ముదిరాజ్ గ్రామ పెద్దలు గడ్డం లక్ష్మయ్య, చింతల భద్రయ్య, మింగని రాములు, చింతల్ రామకృష్ణ, మరియు కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు..
0 Comments