పేద కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన టిఆర్ ఎస్ జిల్లా యువనేత ,మాజీ ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి
గుమ్మడిదల:వాస్తవ తెలంగాణ న్యూస్:
గుమ్మడిదల మండల పరిధిలో రామ్ నగర్ కాలనీలో నివాసముంటున్న పుట్నాల సంజీవ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఉప సర్పంచ్ , టిఆర్ఎస్ జిల్లా యువనేత నరేందర్ రెడ్డి సంజీవ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం కుటుంబ ఖర్చుల నిమిత్తం ఐదు వేల ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో.. వార్ఢు సభ్యులు రాము తో పాటు నాయకులు దాసరి ఆంజనేయులు, రామ గౌడ్, కవ్వం రవీందర్ రెడ్డి, చిమ్ముల శ్రీనివాస్ రెడ్డి, తునికి సుధాకర్, శేఖర్ యాదవ్, నిరుడు శేఖర్ మరియు తదితరులు ఉన్నారు.
0 Comments