మల్లన్న ఆలయానికి విరాళం
* రూ.10వేలు అందజేసిన కాలనీ కోశాధికారి దుర్గం స్వామి
జవహర్ నగర్, జనవరి 30
: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని బాలాజీ నగర్ లో శ్రీ మల్లన్న స్వామి ఆలయ నిర్మాణానికి విరాళాలు సేకరిస్తున్నారు. ఇందుకు మోహన్ రావు కాలనీ సంక్షేమ సంఘం కోశాధికారి దుర్గం స్వామి ఆదివారం ఉదయం రూ.10 వేల విరాళాన్ని మల్లన్న ఆలయ కమిటీ అధ్యక్షుడు బోయిని సత్యనారాయణ యాదవ్ కు అందజేశారు. స్వచ్చందంగా ముందుకు వచ్చి విరాళం అందజేసిన దుర్గం స్వామి ని ఆలయ కమిటీ అధ్యక్షుడితోపాటు సభ్యులు, కాలనీ వాసులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కృష్ణ యాదవ్, అశోక్ యాదవ్, చిల్పురి కొమురయ్య యాదవ్, సీత కొమురయ్య యాదవ్, రామకృష్ణ యాదవ్, రాజు యాదవ్, జంపయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments