*విజేతలకు బహుమతులను అందించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి*
మెదక్ జిల్లా వాస్తవ తెలంగాణ న్యూస్
*క్రిడాలల్లో గెలుపు ఓటములు సహజం*
పాపన్నపేట మండలం రాజ్య తండలో గత రెండు రోజులుగా నిర్వహించిన వాలీబాల్,కబడ్డీ పోటీలు సాయంత్రం ముగిసాయి, ఈ పోటీలలో కబడ్డీ ఆటలో పాపన్నపేట్ మొదటి స్థానంలో నిలువగా రెండో స్థానంలో రాజ్య తండా నిలిచింది, మరోపక్క వాలీబాల్ ఫైనల్ మిర్జాపల్లి తండా వాసులు మొదటి బహుమతి గెలుచుకోగా, సేవాలాల్ తండా టీం రెండవ బహుమతి గెలుచుకున్నారు, విజేతలకు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి బహుమతులు ఇవ్వడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీలల్లో గెలుపోటములు చాలా సహజం, ఆటలో గెలుపు కంటే ముఖ్యం పాల్గొనడమే అని అన్నారు ఆటలల్లో పాల్గొనడం ద్వారా మన యొక్క మానసిక, శారీరక దాడుర్యం పెరుగుతుంది, అంతేకాకుండా యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు, గెలిచినవారు ఉప్పొంగి పోవలసిన అవసరం లేదు, ఓడిపోయిన వారు కృంగిపోవలసిన అవసరం లేదు, మళ్లీ రాబోయే రోజుల్లో ఓడినవారు ఎలా గెలవాలనే దానిపై దృష్టి సారిస్తే గెలుపు వారి ముంగిట వాళుతుందని ఆయన అన్నారు, రాబోయే రోజుల్లో కూడా క్రీడాలకు ప్రోత్సహించడానికి ఎల్లవేళలా ముందుంటానని ఆయన అన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పీసీసీ నాయకులు సుప్రభాత రావు, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, డిసిసి అధికార ప్రతినిధి మామిళ్ల ఆంజనేయులు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పల్లె రామచంద్రగౌడ్, ఎంపిటిసిలు శ్రీనివాస్,రమేష్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆఫీస్ఉద్దీన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ఉదయ్, అజయ్ ,వెంకటేష్, ఆర్గనైజర్స్ ప్రేమ్ కుమార్, జకారియ ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు
0 Comments