Wanted Reporters

Wanted Reporters

రాష్ట్రంలో ఒక జిల్లాకు అంబెడ్కర్ పెరు పెట్టాలి:నల్లి రాజేష్

 రాష్ట్రంలో ఒక జిల్లాకు అంబెడ్కర్ పెరు పెట్టాలి:నల్లి రాజేష్                                                                  




వాస్తవ తెలంగాణ న్యూస్:

చిన్న జిల్లాలతోనే అల్పవర్గాలు, బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి సాదిస్తారని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ ఎప్పుడో చెప్పారని, ఆ దిశగా ముఖ్యమంత్రి జగన్ 26 జిల్లాలుగా మార్చడానికి చర్యలు తీసుకోవడం సంతోషాదాయకమని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ అన్నారు. రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును పెట్టాలని నల్లి రాజేష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మాల మహానాడు జిల్లా సమావేశం ఏలూరు మండలం పైడి చింతపాడులో జిల్లా అధ్యక్షులు గుండె నగేష్  అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్య అతిధిగా హాజరైన రాజేష్ మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ 13 జిల్లాలను, 26 జిల్లాలుగా మారుస్తూ నిర్ణయించడం శుభపరిణామామన్నారు. అలాగే ఏ ఏ జిలాలలకు ఏ పెరు పెట్టాలి, నై సర్గిక స్వరూపాలు ఎలా ఉండాలి అని అంశాలపై స్థానిక ప్రజలు, మేధావుల అభిప్రాయాలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొల్లేరు ప్రజల.అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని ఆయన కోరారు. ఈ సందర్బంగా మాల మహానాడు ఏలూరు మండల అధ్యక్షులుగా ఇంటి   అఖిల్ ని నియమించడం జరిగిందని ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కర్రీ జోగయ్య, జిల్లా ఉపాధ్యక్షులు సరేళ్ల శ్రీనివాస్, ఏలూరు పార్లమెంటరీ నియోజక వర్గ అధ్యక్షులు సుంకర  రాజేష్, జిల్లా కార్యదర్శి గరపాటి నానాజీ, నరసాపురం డివిజన్ ఉపాధ్యక్షులు తండా ఇస్సాకు రాజు మాజీ ఎంపిపి భర్త  మొరు  సుబ్బారావు, గ్రామ ఉప సర్పంచ్ పెనుమాల ప్రభాకర్ ఇంటి దానియేలు సిహెచ్ ప్రసాద్ ఇమ్మానియేల్ మొదలగు వారు పాల్గొన్నారు

Post a Comment

0 Comments

Ad Code