Wanted Reporters

Wanted Reporters

* ఆపన్నహస్త మిత్ర బృందం ఆధ్వర్యంలో ఆర్థిక సాయం

 * ఆపన్నహస్త మిత్ర బృందం ఆధ్వర్యంలో ఆర్థిక సాయం *


-పేదింటి ఆడబిడ్డ పెళ్లికి 34000రూపాయలు అందజేత*




కొండపాక వాస్తవతెలంగాణ న్యూస్:-గజ్వేల్ ఆపన్నహస్త మిత్ర బృందం 55వ కార్యక్రమం ఆదివారం రోజున సిద్దిపేట జిల్లా, కొండపాక మండలం, లకుడారం గ్రామానికి చెందిన తంగెళ్ళ పెల్లి శివాని పెండ్లికి ఆర్థిక సాయం చేశారు , లకుడారం గ్రామానికి చెందిన బీద కుటుంబానికి చెందిన తంగెళ్లపెల్లి సుజాత యాదగిరి చారి దంపతులకు ఒక్కతే కూతురు తండ్రి కి పక్షవాతం,తల్లికి అనారోగ్యం, రెక్కాడితే కానీ ఇల్లు గడవని పరిస్థితి,  తన ఊరిలోనే కూలి చేసుకుంటూ పూట గడిపే నిరుపేదలు, వారి భాద్యతగ  కూతురి పెండ్లి వారికి తోచినస్థాయిలో చేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది. ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న వీరి పరిస్థిని చూసి మా వంతు సాయంగా శివాని పెండ్లికి  బీరువా, మంచం, పరుపు, కుర్చీలు, పెండ్లి కూతురుకి, తల్లి తండ్రులకు బట్టలు వారి కుటుంబ సభ్యులకు 20350,ఖర్చుగలవస్తువులనుఅందజేశారు,గ్రూపులోని మిత్రలు, సభ్యులు స్పందించి వ్యక్తిగతంగా రమణ, శ్రీధర్10000, అమరేందర్ 2000 , హనుమాన్ దాస్,500, అరవింద్ 1000 ఇచ్చారు,డబ్బుతో అమ్మాయికి జీవనోపాధి గాను కుట్టు మిషన్ తీసుకోవడం,  కుక్కర్, బాసండ్లు,తో పాటు నగదు 1100, మొత్తం 34000 రూపాయలు వరకు పెండ్లకి ఆర్థిక సాయం అందజేశారు. ఈకార్యక్రమంలో అధ్యక్షులు పాశికంటి బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి కటుకం శ్రీనివాస్, కోశాధికారి కొల్లూరి శ్యాం ప్రసాద్, ఉపాధ్యక్షులు మంగళి సాయి, సహాయ కార్యదర్శి కుమ్మరి స్వామి, సభ్యులు, మల్లేశం, అక్బర్, రాంబాబు, శ్రీకాంత్, నరేష్, అభినవ్ కృష్ణ, రామచంద్రం, భానుప్రసాద్ , సత్యనారాయణ, యాదగిరి, అరవింద్, గిరిబాబు, శ్రీకాంత్ , రవికుమార్, వెంకటేష్ తో పాటు గ్రామ సర్పంచ్ ఐలయ్య  గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments

Ad Code