*2022ఏడుపాయల జాతరకు కోటి రూపాయలు మంజూరు*
*ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి*
వాస్తవ తెలంగాణ/పాపన్నపేట జనవరి 30 మెదక్ జిల్లా పాపన్న పేట మండలం నాగ్సాన్ పల్లి వద్ద మంజీరా నది పాయల మధ్యలో వెలసిన వనదుర్గా భవానీ మాత ఆలయ సన్నిధిలో జరిగే ఏడుపాయల జాతర నిర్వహణకు ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసింది. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. ఈ సారి మార్చి నెల ఒకటవ తేదీ నుంచి 3 వ తేదీ వరకు జాతర జరుగనుంది. ఈ నేపథ్యంలో జాతర నిర్వహణ, భక్తుల కు సౌకర్యాల కల్పన కోసం నిధులు మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జాతర అవసరాల కోసం రూ.కోటి మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. జాతర ను ఘనంగా నిర్వహించేందుకు, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం ఈ నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కోరిన వెంటనేఏడుపాయల జాతరకు నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ కి జిల్లా మంత్రి హరీష్ రావు కి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కి భక్తులు మరియు ఆలయం తరఫున ఈవో సార శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
0 Comments