*జిన్నారంలో మహాత్ముడికి ఘన నివాళి*
జిన్నారం, వాస్తవ తెలంగాణ న్యూస్:
మహాత్మాగాంధీ విగ్రహానిక నాయకుల నివాళి
జాతిపిత మహాత్మాగాంధీ 74వ వర్ధంతి దినోత్సవ సందర్భంగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి ఆదివారం స్థానిక నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్, సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి లా ఆధ్వర్యంలో నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత స్వాతంత్రోద్యమంలో గాంధీజీ చేసిన పోరాటాలను ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంజీవ వార్డు సభ్యులు శ్రీనివాస్ యాదవ్, నాయకులు ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, నర్సింగ్రావు, నరేష్ చారి, తదితరులు పాల్గొన్నారు.
0 Comments