Wanted Reporters

Wanted Reporters

పీయూష్ గోయల్ తెలంగాణమంత్రులను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం న్యాయమేనా

 పీయూష్ గోయల్ తెలంగాణమంత్రులను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం న్యాయమేనా :- గజ్వెల్  కమిటి మార్కెట్ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్

 

గజ్వేల్ వాస్తవతెలంగాణన్యూస్/డిసెంబర్22



సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం లో బుధవారం తెలంగాణ మంత్రులపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు అభ్యంతరకరం.తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టత కోసం తెలంగాణ రైతాంగం పక్షాన రాష్ట్ర ప్రతినిధులుగా వెళ్లిన మంత్రులు, ఎంపీలను కేంద్ర మంత్రి అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం అభ్యంతరకరమని పీయూష్ గొయల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని గజ్వెల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ డిమాండ్ చేశారు.తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్లిన మంత్రుల బృందాన్ని ఏం పని లేదా ధాన్యం కొనుగోలు తప్ప మాకు ఏం పని ఉండదా అని వ్యాఖ్యానించడం తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి చేయడమే అని అన్నారు.కేంద్ర మంత్రులు తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తూ,అవమానకరంగా మాట్లాడుతున్నప్పటికి తెలంగాణ బీజేపీ నాయకులు మాత్రం ఇవేమీ పట్టనట్టు కేవలం ఎప్పుడు,ఎట్లా అధిజరంలోకి రావాలని చర్చలు జరపడం సిగ్గుమాలిన చర్య అన్నారు.తెలంగాణ గల్లీల్లో వరిపంటను వేయాలని బీరాలు పలికిన బీజేపీ నేతలు యసంగిలో వరిధాన్యాన్ని కొంటామని ఎందుకు లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వంతో హామీ ఇప్పించ లేకపోతున్నారో చెప్పాలన్నారు.తెలంగాణ రైతుల భవిష్యత్ తో రాజకీయంగా ఆడుకొని లబ్ది పొందాలనే చిల్లర ఆలోచనతో బీజేపీ నాయకులు ఉన్నారని వారి కుట్రలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని వారికి తప్పకుండా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

Post a Comment

0 Comments

Ad Code