>యాదగిరి గుట్ట&భువనగిరి జిల్లా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ప్రెసిడెంట్ గా కలకురి సునీత నియామకం<
>మహిళలకు రక్షణ గా ఉండాలి<
>చట్టాలపై హక్కులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలి<
>త్వరలో పరిచయ వేదిక అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తాం<
హైదరాబాద్, వాస్తవ తెలంగాణ
ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా సునీత ,శ్వేతా, నియామకం.నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్, సోషల్ సర్వీస్, ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఫౌండర్ & ప్రెసిడెంట్ మంగళంపల్లి హుస్సేన్, ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాదులో జరిగిన సమావేశంలో ఆధారంగా ఈరోజు యాదగిరిగుట్ట జిల్లాకు చెందిన కలకురి సునీతను భువనగిరి యాదాద్రి గుట్ట జిల్లా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ పత్రికా ప్రకటన తెలిపి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా మంగళం పెళ్లి హుస్సేన్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు విద్యార్థులకు మహిళలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి న్యాయ పరమైన విషయంలో సలహాలు ఇవ్వాలని అన్నారు, ముఖ్యంగా మహిళా హక్కులపై ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగింది, నాపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు కచ్చితంగా బాధ్యతాయుతంగా నడుచుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది,
0 Comments