Wanted Reporters

Wanted Reporters

బిజెపి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి..బీజేపీ జిన్నారం మండల ఇంచార్జి తోట చంద్రశేఖర్

 బిజెపి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు సంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకులు జిన్నారం మండల ఇంచార్జ్ తోట చంద్రశేఖర్ జిల్లా బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు మద్దూరి లక్ష్మణరావు

జిన్నారం, తెలంగాణ సాక్షి న్యూస్:-



సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మండల కార్యవర్గ సమావేశం జిన్నారం బిజెపి మండల అధ్యక్షులు బండి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి సీనియర్ నాయకులు జిన్నారం మండల ఇంచార్జి తోట చంద్రశేఖర్ సంగారెడ్డి జిల్లా బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు మద్దూరి లక్ష్మణ్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గడపగడపకు తెలిసేలా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు కార్యకర్తలకు సూచించారు . బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి బిజెపి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పార్టీ పదవులు తీసుకోవడం కాకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని అన్నారు . పార్టీలో వర్గ విభేదాలు లేకుండా పని చేయాలని సూచించారు హుజూర్ నగర్ ఉప ఎన్నికలు బిజెపి పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు . ఈ సమావేశ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Post a Comment

0 Comments

Ad Code