ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు తెలంగాణ సాక్షి న్యూస్:-
పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామ పరిధిలోని వడ్డెర కాలనీ లో బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను సోమవారం స్థానిక శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించ తలపెట్టిన చర్చి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో లో స్థానిక సర్పంచ్ నీలం మధు, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, పిఎసిఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఇతరులు పాల్గొన్నారు.


0 Comments