గుమ్మడిదల, తెలంగాణ సాక్షి న్యూస్:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుమ్మడిదల గ్రామపంచాయతి కార్యాలయం నందు జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం సర్పంచ్ చిమ్ముల నర్సింహా రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా స్థానిక ఎంపిపి సద్ది ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి , జెడ్పిటిసి కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్ ,పాలక వర్గ సభ్యులు ఆంజనేయులు, లలిత మరియు కో-ఆప్షన్ మెంబర్ జబ్బార్, పంచాయతీ సిబ్బంది,స్థానికులు పాల్గొన్నారు.


0 Comments