జిన్నారం, తెలంగాణ సాక్షి న్యూస్:
జిన్నారం మండల పరిషత్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎంపిపి రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిన్నారం మండలం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ పురస్కరించుకొని రవీందర్ గౌడ్ మాట్లాడుతూ దశాబ్ద కాలం నుంచి మనం ఎదురు చూస్తున్న తెలంగాణ కలను సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియాగాంధీని చరిత్రలో మర్చిపోలేనని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర కలను అనేక అడ్డంకులు ఇబ్బందులు ఎదురైనా తెలంగాణ కు ఇచ్చిన మాటను కట్టుబడి ప్రజలు కోరుకున్న బంగారు తెలంగాణ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిన్నారం ఎంపీడీవో సుమతి, వైస్ ఎంపీపీ గంగు రమేష్, సూపరిండెంట్ రాములు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

0 Comments