Wanted Reporters

Wanted Reporters

💥నకిలీ విత్తనాలు, మందులు అమ్మితే పిడి యాక్ట్ కేసులు💥



గుమ్మడిదల, తెలంగాణ సాక్షి న్యూస్
:

నకిలీ విత్తనాలను మరియు నకిలీ పురుగుల మందులను రైతులకు అమ్మిన, దానికి సహకరించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయనీ,అలాంటి వ్యక్తులపై పిడి యాక్ట్ కేసులు పెట్టడం జరుగుతుందని గుమ్మడిదల ఎస్సై విజయ్ కృష్ణ అన్నారు. గుమ్మడిదల లోని పలు విత్తనాలు, ఫర్టిలైజర్ లు అమ్మే షాప్ లను ఎస్సై పరిశీలించారు.  

ఈ సందర్భంగా మంగళవారం ఆయన మండల కేంద్రంలో మాట్లాడుతూ ప్రతి రైతు విత్తనాలను వ్యవసాయ శాఖ నుండి అనుమతి పొందిన డీలర్ వద్దనే కొనాలి. నకిలీ విత్తనాలను అమ్మే వ్యక్తుల గురించి ఎవరికైనా తెలిసినట్లైతే మాకు సమాచారం ఇవ్వాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే వారిని ప్రోత్సహించిన పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయబడతాయని తెలియజేశారు. అంతేకాకుండా రెండు మూడు రోజుల్లో రైతులు, వ్యవసాయ అధికారులు డీలర్లతో పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఎస్సై తెలిపారు.

Post a Comment

0 Comments

Ad Code