గుమ్మడిదల, తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ సిబ్బందికి గ్రామస్తులకు బొంతపల్లి గ్రామానికి చెందిన క్లారియంట్ ఇండియా లిమిటెడ్ పరిశ్రమ సహకారంతో స్థానిక సర్పంచ్ నర్సింహా రెడ్డి మాస్కులు పంపిణీ చేశారు. కరోనా కట్టడి చర్యలకు ముందుకు వచ్చిన పరిశ్రమలు సర్పంచ్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దేవేందర్ గౌడ్, వార్డు సభ్యులు రవీందర్ రెడ్డి, సత్యనారాయణ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

0 Comments