జిన్నారం తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామంలో జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ ప్రభాకర్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచన తో వావిలాల గ్రామంలో ఐదు లక్షల రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, అదేవిధంగా నల్తూర్ నుంచి కొడకంచి గ్రామాలకు ఐదు లక్షల రూపాయల వ్యయంతో మట్టి రోడ్డుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు శివరాజ్, మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్, నాయకులు జనార్ధన్, రవీందర్, సురేందర్ రెడ్డి,సంతోష్ ప్రభాకర్ శ్రీనివాస్ వెంకటేష్ పర్వతాలు మల్లయ్య బాలచందర్ నర్సింగ్ రావు పద్మారావు అశోక్ ఆయా గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


0 Comments