Wanted Reporters

Wanted Reporters

నిరుద్యోగ సమష్యలను గాలికొదిలిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో టీజీఎఫ్ ఆధ్వర్యంలో కొత్త పార్టీ ఏర్పాటు..దొడ్ల.వెంకట్,టీజీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు

 *నిరుద్యోగ సమష్యలను గాలికొదిలిన రాష్ట్ర ప్రభుత్వం.*


*త్వరలో  టీజీఎఫ్ ఆధ్వర్యంలో కొత్త పార్టీ ఏర్పాటు.*


*దొడ్ల.వెంకట్,టీజీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు.*


హైదరాబాద్, తెలంగాణ సాక్షి న్యూస్:-

పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు దొడ్ల.వెంకట్ మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. ఉన్నత చదువులు చదివి దిక్కు తోచని పరిస్థితుల్లో నిరుద్యోగులు రోడ్ల పై తిరుగుతున్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో చివరకు నిరుద్యోగులకు  నిరాశే మిగిలింది. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన,  టీజీఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగులను కలుపుకొని త్వరలో ఒక కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నామని ఆయన అన్నారు. ప్రస్తుత తరుణంలో నిరుద్యోగుల పక్షాన మాట్లాడే పార్టీలు లేవని ఎంతసేపు వారి  రాజకీయలబ్ధి కోసమే తప్ప  ఏ పార్టీ కూడా నిరుద్యోగుల పక్షాన సక్రమంగా పోరాటం చేయలేదని, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని ఆయన మండిపడ్డారు. అతి త్వరలో పార్టీకిిిి సంబంధించిన విషయాలను తెలియజేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సింధూలురి రాజశేఖర్, ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కొత్త బస్వరాజ్ పాటిల్, రాష్ట్ర నాయకులు ప్రతాప్, సంగమేష్, రాజు, వీరేష్ దితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code