Wanted Reporters

Wanted Reporters

రంజాన్ తోఫా లను పంపిణీ చేసిన పంచాయతీ పాలకవర్గం సభ్యులు

 


*రంజాన్ తోఫా లను పంపిణీ చేసిన పంచాయతీ పాలకవర్గం సభ్యులు*

జిన్నారం తెలంగాణ సాక్షి న్యూస్:-

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్ర పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ వర్గాలకు రంజాన్ కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గం సభ్యులు నిరుపేద ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ తోఫా లో భాగంగా కొత్త బట్టలను పంపిణీ చేశారు. అనంతరం మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేద ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పండుగ కానుకలుగా కొత్త బట్టలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కెసిఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంజీవ, వార్డు సభ్యులు శ్రీనివాస్ యాదవ్ శ్రీధర్ గౌడ్ ఎరుపుల లింగం, కో ఆప్షన్ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు బ్రహ్మేంద ర్ గౌడ్, ఆత్మ కమిటీ డైరెక్టర్ మహేష్ యాదవ్, నర్సింగ్ రావు మల్లేష్, ముస్లిం మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code