కోవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోసు వేయించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్, కుటుంబ సభ్యులు
పటాన్ చేరు తెలంగాణ సాక్షి న్యూస్:-
పటాన్ చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం పటాన్చెరు లోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోసు వేయించుకున్నారు. మొదటి డోసు వేయించుకున్న ప్రతి ఒక్కరూ రెండో డోసు విధిగా వేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఇందుకు సంబంధించి వైద్య శాఖ సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

0 Comments