జిన్నారం లో ముమ్మరంగా కోవిడ్ సర్వే
జిన్నారం తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో కోవిడ్ సర్వే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బిల్ కలెక్టర్ విజయ్ ఆధ్వర్యంలో పంచాయితీ సిబ్బంది ఇంటింటికి వెళ్లి జలుబు, దగ్గు, జ్వరం తో రెండు మూడు రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి వివరాలను సేకరించారు. ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉంటే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి వైద్య సహాయం పొందాలని సూచించారు. అదేవిధంగా వైద్యుల సూచన మేరకు వైద్య సిబ్బంది రోగులకు మెడికల్ కిట్లు అందజేశారు.

0 Comments