అమెరికా నుంచి బయల్దేరిన అత్యవసర సహాయం, పరికరాలు నేడు భారత్ చేరుకొన్నాయి.
తెలంగాణ సాక్షి న్యూస్:-
న్యూఢిల్లీ : అమెరికా నుంచి బయల్దేరిన అత్యవసర సహాయం, పరికరాలు నేడు భారత్ చేరుకొన్నాయి. ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం ట్విటర్లో వెల్లడించింది. ‘‘కొవిడ్‌తో పోరాడేందుకు అవసరమైన అత్యవసర పరికరాలు, ఇతర సాయంలో అవసరమైన తొలివిడత షిప్‌మెంట్ భారత్‌కు చేరింది. భారత్-అమెరికాలు కొవిడ్‌పై ఉమ్మడిగా పోరాడతాయి’’ అని పేర్కొంది. దీనికి #USIndiaDosti అనే హ్యాష్‌ట్యాగ్ ఇచ్చింది.
*10 లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు..*
అమెరికా నుంచి వచ్చిన వాటిల్లో 400 ఆక్సిజన్ సిలిండర్లు, దాదాపు 10 లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు, ఆసుపత్రుల్లో వినియోగించే అత్యవసర పరికరాలు ఉన్నాయి. వీటిlr తీసుకొచ్చిన అమెరికా సూపర్ గెలాక్సీ విమానం నేటి ఉదయం దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రమంలో దిగింది.
ఈ వారం మొదట్లో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ భారత్‌కు అత్యవసర సహాయం విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ‘‘అమెరికాలో కొవిడ్ విజృంభిస్తున్న సమయంలో భారత్ మా పక్షాన నిలబడింది. ఇప్పుడు భారత్‌కు అవసరం వచ్చింది. మేము భారత్ పక్షాల నిలబడాలనే దృఢసంకల్పం తీసుకొన్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు భారత్‌లో టీకాల తయారీకి అవసరమైన ముడి పదార్థాల సరఫరాకు కూడా అమెరికా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
*బ్రిటన్, రొమానియా నుంచి కూడా..*
నేడు బ్రిటన్, రొమానియా నుంచి కూడా భారత్‌కు కొవిడ్ సాయం అందింది. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ ప్రతినిధి అరిందం బగాచీ ధ్రువీకరించారు. రొమానియా నుంచి 80 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, 75 ఆక్సిజన్ సిలిండర్లు అందగా.. యూకే నుంచి 280 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు అందాయి. అంతకు ముందు ఐర్లాండ్ నుంచి భారత్‌కు 700 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు చేరాయి. అంతేకాదు 365 వెంటిలేటర్లను కూడా ఐర్లాండ్ అందజేసింది. ఈ సాయానికి యూకే, రొమానియా, ఐర్లాండ్ దేశాలకు భారత్ ధన్యవాదాలు తెలిపింది

0 Comments