Wanted Reporters

Wanted Reporters

కెసిఆర్ ప్రభుత్వ హాయంలో గ్రామాలకు మహర్దశ .. దుబ్బగుంట లో సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

 కెసిఆర్ ప్రభుత్వ హాయంలో గ్రామాలకు మహర్దశ

దుబ్బగుంట లో సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్




జిన్నారం తెలంగాణ సాక్షి న్యూస్:-


ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోని ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్   రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయము  మండల పరిధిలోని మాదారం గ్రామపంచాయతీ మధిర గ్రామమైన దుబ్బ గుంటలో ఐదు లక్షల రూపాయల జిల్లా పరిషత్ నిధులతో ఏర్పాటు చేయనున్న సి సి రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాదారం నుండి మంత్రి కుంట  వరకు చేపడుతున్న ప్రధానమంత్రి సడక్ యోజన రోడ్డు పనులను పరిశీలించారు. ఈ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ   పల్లె ప్రగతి అనే వినూత్న కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, వాటర్ ట్యాంకర్ అందించడంతోపాటు వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పంచాయితీ అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనుల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

Post a Comment

0 Comments

Ad Code