గుట్టుగా.. ఐపీఎల్ బెట్టింగ్‌కొ విడ్ ఉద్ధృతిలోనూ ఆగని దందాతెెలంగాణ సాక్షి న్యూస్:-
ఏటా ఐపీఎల్ క్రికెట్ పోటీలకు జిల్లాలోని యువత భారీగానే నష్టపోతోంది. ఇటీవల ప్రారంభమైన ఈ పోటీలలోనూ జిల్లాలోని పల్లె, పట్టణాల్లోని యువత బెట్టింగ్‌కు మొగ్గుచూపుతున్నారు. మహారాష్ట్ర కేంద్రంగా సాగుతున్న ఈ బెట్టింగ్ జిల్లా వ్యాప్తంగా చాపకింద నీరులా వ్యాపించి యువతను పెడదారి పట్టిస్తోంది.
కొవిడ్‌తో ఇంటిపట్టునే ఉంటున్న అభిమానులకు ఐపీఎల్ మ్యాచ్‌లు బోలెడంత వినోదం పంచుతోంది. ఆట ఆరంభం నుంచి చివరి వరకు ఉత్కంఠను రేపుతున్న మ్యాచ్‌లను ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇదే సమయంలో బెట్టింగ్ బాబులు జోరుగా పందాలకు తెరలేపుతున్నారు. ఈ సారి కరోనా పరిస్థితుల దృష్ట్యా బెట్టింగ్‌లో నేరుగా డబ్బులు పెట్టకుండా ఆన్‌లైన్ మార్గాలను ఎంచుకుంటున్నారు.
గుట్టుగా.. ఐపీఎల్ బెట్టింగ్
అంతా చరవాణుల్లోనే..
* మహారాష్ట్రలోని సిరోంచా, వని ప్రాంతానికి చెందిన బుకీలు బెట్టింగ్ కోసం ప్రత్యేక యాప్‌లో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ నమోదు చేస్తున్నారు. ప్రత్యేక లింక్ ద్వారా యువకులకు పంపిస్తూ రోజువారీగా జరిగే మ్యాచ్‌లకు లావాదేవీలు చేస్తున్నారు. 777, లూటస్, డైమెండ్ లనే పదాలను కోడ్ భాషలుగా ఉపయోగిస్తున్నారు. బెట్టింగ్‌కు పాల్పడే వారు మొదట బుకీలకు డబ్బులు పంపగా ప్రతి శని, సోమవారం చెల్లింపులు జరుపుతున్నారు.
* జిల్లాలోని పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ పెద్దఎత్తున క్రికెట్ బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఈ సంస్కృతి జిల్లాకేంద్రంతో పాటు లక్షెట్టిపేట, మేదరిపేట, దండేపల్లి, చెన్నూరు, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, మందమర్రి, రామకృష్ణాపూర్, తాండూరులో చాప కింద నీరులా సాగుతోంది. నిత్యం ఒక్కో మ్యాచ్‌పై రూ.1000 నుంచి రూ. లక్షల్లో సాగుతోంది.
* గతేడాది జిల్లాలో ఐదు కేసులలో 41 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు రూ.3.5 లక్షల నగదు, చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది యువత పెద్దఎత్తున నష్టపోకముందే పోలీసులు బెట్టింగ్ నిర్వహణపై ప్రత్యేక నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది.
ఓ కన్నేసి ఉంచాలి..
ప్రస్తుతం కళాశాలలు లేకపోవడం, బయటకు రాకపోవడంతో కొంత మంది యువకులు ఆన్‌లైన్ ద్వారా సంప్రదింపులు చేస్తూ బెట్టింగులను ప్రోత్సహిస్తున్నారు. దీనిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచడం లేదు. గతంలో డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి హాజీపూర్‌లో యువతకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు. అదే తరహా గతంలో బెట్టింగ్‌కు పాల్పడిన వారి వివరాలు సేకరించి ప్రస్తుతం వారి కార్యకలాపాలను గుర్తించాలి. యువత చెడదారిన పడకుండా ఉండాలంటే పోలీసులతో పాటు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలి. వారి బ్యాంకు ఖాతాల నుంచి నగదు బదిలీలను పరిశీలిస్తుండాలి

0 Comments