గుమ్మడిదల, తెలంగాణ సాక్షి న్యూస్:
దేవాలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ తన సంపూర్ణ సహకారం ఉంటుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గుమ్మడిదల మండలం నాగిరెడ్డి గూడెం గ్రామంలో నిర్వహిస్తున్న బీరప్ప విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి తనవంతుగా లక్ష రూపాయల విరాళం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కులం, మతం ప్రాంతం తేడా లేకుండా అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి, జడ్పిటిసి కుమార్ గౌడ్, ఎంపీటీసీ ప్రభాకర్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments