జిన్నారం తెలంగాణ సాక్షి న్యూస్
తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసమే 20 ఏళ్ల క్రితం టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందాని అది నేడు ఆచరణలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ దని అన్నారు టిఆర్ఎస్ పార్టీ యువత అధ్యక్షులు జిన్నారం వెంకటేష్ గౌడ్ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిన్నారం లో తన నివాసంలో గులాబీ జెండా ను నిరాడంబరంగా ఆవిష్కరించారు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ యువత అధ్యక్షులు వెంకటేశం గౌడ్ మాట్లాడుతూ స్వరాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన జెండా యావత్ తెలంగాణ జనులందరి నీ ఒక తాటిపైకి తెచ్చిన జెండా మన గులాబీ జెండా అని అన్నారు టిఆర్ఎస్ పార్టీ ఇరవైఒక్క ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ముఖ్య మంత్రి కెసిఆర్ , మంత్రి కెటిఆర్ పిలుపుమేరకు మా ఇంటి పై గులాబీ జెండాను ఆవిష్కరించడం జరిగింది అన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన కాలం లో అనేక అద్భుతాలు సాధించిందాని సంక్షేమ విద్యుత్ మంచినీరు సాగునీరు వ్యవసాయం పరిశ్రమలు తదితర రంగాల్లో గొప్ప విజయాలు నమోదు చేసిందని ప్రజలు దశాబ్దాల తరబడి ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించింది టిఆర్ఎస్ పార్టీ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచేలా ఎన్నో పథకాలు కార్యక్రమాలు అమలు చేస్తుందని ఇది టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణమని అన్నారు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంతో గొప్పగా జరుపుకోవాల్సిన వేడుకను కరోనా వైరస్ నేపథ్యంలో నేడు నిరడంబరంగా జరుపుకుంటున్నామని పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకుంటున్నామని అన్నారు . ఈ సందర్భంగా మరొకసారి టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు .

0 Comments