తెలంగాణ సాక్షి గుమ్మడిదల:-
కరొన మహమ్మారి కి బలైన జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం బాసటగా నిలిచిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు గుమ్మడిదల మండల ప్రెస్ క్లబ్ తెలిపింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కేవలం పది రోజుల వ్యవధిలోనే సుమారు 15మంది జర్నలిస్టులు మృతి చెందడం, అత్యంత బాధాకర విషయం అని అన్నారు. కరోనా బారిన మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రెండో దశ కరోనా విజృంభిస్తున్న తరుణంలో జర్నలిస్టులకు వైద్య సాయం అందించి, ఫ్రంట్ లైన్ వారియర్స్ గుర్తింపు ఇవ్వాలని, గౌరవ వేతనం గా పదివేల రూపాయలు ఇవ్వాలని కోరారు. జర్నలిస్టులు అందరూ మాస్కులు, శానిటైజర్ లు ఉపయోగించుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా నిబంధనలు పాటించాలని ప్రెస్ క్లబ్ పేర్కొంది. జర్నలిస్టుల సమస్యల గురించి కృషి చేస్తున్న ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు శేఖర్ రవీందర్ కులకర్ణి ,ఆనంద్,యాదగిరి, శ్రీధర్, రామకృష్ణ,సత్యం, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్, జీవరత్నం, శ్రీకాంత్, నర్సింగ్ రావు, నరేందర్ రెడ్డి, శ్రీశైలం, నర్సింగ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments