*తెలంగాణ ఉద్యమ యువ కెరటం జిన్నారం వేంకటేశం గౌడ్*
*టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ తో జిన్నారం వేంకటేశం గౌడ్ ప్రయాణం
| కెె |
వేంకటేశం గౌడ్ ప్రయాణం*
*తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం*
జిన్నారం తెలంగాణ సాక్షి న్యూస్*
2001 ఏప్రిల్ 27 తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీగా పురుడుపోసుకుంది నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఆవిర్భవించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ జాతిని విముక్తం చేయడానికి కెసిఆర్ ఉద్యమ పార్టీని స్థాపించి తొలి అడుగు వేశారు కెసిఆర్ ఉద్యమ తీరును వారు నమ్మిన సిద్ధాంతాలను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ అడుగులో అడుగు వేసి నడిచిన *జిన్నారం వెంకటేశం గౌడ్* కెసిఆర్ సారథ్యంలో ఉద్యమ సమయంలో తనకంటూ ఒక గుర్తింపు పొందిన నాయకుడిగా జిన్నారం వెంకటేష్ గౌడ్ ప్రస్థానం కొనసాగింది ప్రత్యేక రాష్ట్రమే ఏకైక అజెండాగా తెలంగాణ నినాదం భావన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఇక్కడి ప్రజలు తీసుకెళ్లేందుకు కీలక పాత్ర పోషించారు ఇక్కడుండే యువతలో కూడా ఉద్యమ స్ఫూర్తిని నింపి కష్టాలను నష్టాలను అవమానాలను దిగమింగి జై తెలంగాణ అని నినాదాలు ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్ళాడు ప్రజలు ఎప్పుడూ చైతన్యవంతులు అవుతారో అప్పుడే అనుకున్నది సాధించగలమని ప్రజల్లో స్పూర్తిని నింపుతూ ఉద్యమం లో నడిచాడు
◆దేశ రాజకీయ వ్యయస్థాని ఒప్పించి తన ఆమరణ నిరాహారదీక్ష తో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ గారిది
◆జిన్నారం వెంకటేశం గౌడ్ 2001 నుండి కేసీఆర్ వెనక తెలంగాణ ఉద్యమంలో ధర్నాలు, రాస్తారోకోలు, జైల్ భరో, వంట వార్పు, మిలియన్ మార్చ్, దీక్ష దివస్, వంటి ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నాడు.
◆2001 లో టీఆర్ఎస్ యువజన విభాగంలో రాష్ట్ర సెక్రటరీ గా
◆తెలంగాణ జాగరణ సేన రాష్ట్ర కమాండర్ గా
◆ఉమ్మడి మెదక్ జిల్లా యువత అధ్యక్షుడిగా ఉద్యమంలో పని చేసాడు
◆గత 20 సంవత్సరాలు ఒకే పార్టీలో కేసీఆర్ కి అత్యంత ఆప్తుడిగా నమ్మకస్థుడిగా కూడా వెలిగారు.
◆2014 టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా వెంటనే ప్రవేశ పెట్టిన పధకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి..
◆జిన్నారం వెంకటేశం గౌడ్ నాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో , తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా ప్రభుత్వ పధకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి జిన్నారం వెంకటేశం గౌడ్ కృషి ఎనలేనిది....టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.


0 Comments