- గుమ్మడిదల మండల బీఆర్ఎస్ పార్టీ నూతన మండల అధ్యక్షుడిగా మాజీ ఎంపీటీసీ కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి
- రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల ఏకగ్రీవ ఎన్నిక
- ఉపాధ్యక్షులుగా కొత్తపల్లి మల్లేష్ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా అన్నారం నరహరి
గుమ్మడిదల,వాస్తవ తెలంగాణ న్యూస్:
బీఆర్ఎస్ పార్టీ గుమ్మడిదల మండలం నూతన అధ్యక్షుడిగా కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డిని ముఖ్య నాయకుల సమక్షంలో ఎన్నుకున్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని సిజీఆర్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ నూతన అధ్యక్షుడిగా కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయనతోపాటు ఉపాధ్యక్షులుగా కొత్తపల్లి మల్లేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా అన్నారం నరహరిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడమే లక్ష్యంగా స్థాపించబడిన బీఆర్ఎస్ పార్టీ ఎన్నో కష్టాలు చూసిందని అన్నారు. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక రాష్ట్రం సాధించి రెండుసార్లు అధికారంలోకి వచ్చిందని అన్నారు. గత హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఎన్నో పదవులు అనుభవించిన నాయకులు నేడు అధికారం మారగానే పార్టీ మారడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కనపెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. నూతన మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలో పార్టీని బలోపేతం చేయడమే కాక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసేంతవరకు ప్రజా గొంతుకై ప్రశ్నిస్తూ వస్తుందని అన్నారు. నూతనంగా ఏనుకోబడ్డ మండల నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో మరింత బలోపేతంగా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాజా సర్పంచులు, ఎంపీటీసీలు, అన్ని గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు,ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


0 Comments