ఊరూరా రోడ్ షో.
ప్రతి గ్రామాoలో బిఆర్ఎస్ పార్టీ కి నీరాజనాలు: వంటేరు ప్రతాప్ రెడ్డి
తూప్రాన్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి నవీన్ :
తూప్రాన్ మండల పరిధిలోని వట్టూరు, నాగులపల్లి, ఇస్లాంపూర్, వెంకటరత్నపూర్, దాతర్ పల్లి, గ్రామాలలో ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి మరియు మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ప్రచారం కొనసాగించారు. ఊరూరున కళాకారుల బృందంచే తెలంగాణ సాంప్రదాయంతో ఆటపాటలు పాడుతూ బంజారాల నాట్యాలతో వీధుల్లో ప్రదర్శించారు. ముచ్చటగా మూడవసారి కల్వకుంట చంద్రశేఖర్ రావును ముఖ్యమంత్రిని చేయాలని వీధుల్లో సభలు ఏర్పాటు చేసి షో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్, జెడ్పిటిసి రాణి సత్యనారాయణ గౌడ్, మండల అధ్యక్షులు గడ్డి స్వప్న వెంకటేష్ యాదవ్, సర్పంచులు వెంకటరామిరెడ్డి, శ్రీలత రాజిరెడ్డి, గుర్రం ఎల్లం, సత్యనారాయణ గౌడ్, గ్రామ అధ్యక్షుడు కుమ్మరి నర్సింలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, గ్రమల పాలక వర్గం సభ్యులు, బిఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు, భారీ ఎత్తున పాల్గొన్నారు.

0 Comments