Wanted Reporters

Wanted Reporters

3 ఏకరాల సామాన్యుడికి.. 3వేల ఏకరాల ఆసామికి మధ్య యుద్ధం.. విద్య, వైద్యం, ఉచితంగా అందిస్తాం: ఈటెల రాజేందర్


 3 ఏకరాల సామాన్యుడికి..

3వేల ఏకరాల ఆసామికి మధ్య యుద్ధం..


విద్య, వైద్యం, ఉచితంగా అందిస్తాం: ఈటెల రాజేందర్ 






మనోహరబాద్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి నవీన్ : ముఖ్యమంత్రి నియోజకవర్గం మనోహరాబాద్ మండలం లో బిఆర్ఎస్ పార్టీ కి భారీ షాక్ తగిలింది. ఆదివారం మండలం కిలక నేతలు , పలు గ్రామాల సర్పంచ్ లు భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈటెల సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు.కాళ్లకల్ సర్పంచ్ నత్తి మల్లేష్ ఆధ్వర్యంలో కొండాపూర్ సర్పంచ్ చింతల మమత రవి, కుచారం సర్పంచ్ జక్కిడి నరేందర్ రెడ్డి,జీడిపల్లి గ్రామ ప్రజాప్రతినిధులు,కొనాయిపల్లి సర్పంచ్ ప్రభావతినర్సింలు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు భాష బోయిన చంద్రశేఖర్ ముదిరాజ్ లు భారీ సంఖ్యలో పాలకవర్గం సభ్యులు, బిఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ అభ్యర్ధి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు హారతులతో స్వాగతం పలికి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి   చేరారు.మరియు ఆయా గ్రామాల పాలకవర్గం సభ్యులు బీజేపీ లో చేరారు.అగ్రహారం పాలకవర్గం సభ్యులు,జడ్పీ చైర్మన్ అనుచరులు తెలంగాణ ఉద్యమకారుడు ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాలట పాండు పలువురితో కలిసి ఈటెల సమక్షంలో బీజేపీ లో చేరారు. అనంతరం ఈటెల మాట్లాడుతూ నమ్మి ఓటు వేస్తే ముంచిన ఘనుడు కెసిఆర్ అని అన్నారు. కెసిఆర్ ను ఇంటికి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.ఈ కార్యక్రమం లో రామ్మోహన్ గౌడ్,సాయిబాబా,నందన్ గౌడ్, నరేందర్ చారి, గుమ్మడి శ్రీను, అరికల కృష్ణ భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code