Wanted Reporters

Wanted Reporters

మైలాన్ పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి

తెలంగాణ సాక్షి-ఐడిఏ బొల్లారం


సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామ పరిధిలోని మైలాబ్ పరిశ్రమ యూనిట్ వన్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ ఘటన బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని గడ్డపో తారం పారిశ్రామికవాడలో చోటు చేసుకుంది. సీఐ ప్రశాంత్, కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం సత్తిబాబు (46) మైలాన్ యూనిట్ వన్ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుడు గా పని చేస్తున్నాడు. బుధవారం ఎనిమిది గంటలకు డ్యూటీకి వెళ్లగా రాత్రి ఎనిమిదిన్నర గం టల ప్రాంతంలో అతను వాంతులు చేసుకున్నాడు. దాంతో కాంట్రాక్టర్ నగరంలోని ప్రయివేటు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెం దాడు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరిశ్రమలో వచ్చే కెమికల్ వాసనకు తట్టుకోలేకే అతను మృతి చెంది ఉంటాడని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు..

Post a Comment

0 Comments

Ad Code