రాష్ట్రంలోని మహిళా సంఘాలకు రుణ ప్రణాళిక ఖరారు చేస్తూ తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నిర్ణయం
తెలంగాణ సాక్షి న్యూస్:-
![]() |
హైదరాబాద్ : రాష్ట్రంలోని మహిళా సంఘాలకు రుణ ప్రణాళిక ఖరారు చేస్తూ తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నిర్ణయం తీసుకుంది. వార్షిక రుణ ప్రణాళికను సెర్ప్ సీఈఓ సందీప్ కుమార్ సుల్తానియా బుధవారం విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో కూడా గత ఏడాది రుణాలు ఇప్పించామని ఈ సందర్భంగా వెల్లడించారు. అదే స్పూర్తితో ఈ ఏడాది రాష్ట్రంలోని 3,82,276 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 12,088.30 కోట్లను బ్యాంకుల నుంచి రుణాలుగా ఇప్పించేందుకు లక్ష్యంగా విధించుకున్నట్లు వెల్లడించారు.
గత ఆర్థిక సంవత్సరంలో 3,13,033 సంఘాలకు రూ. 10,272.16 కోట్ల రుణ లక్ష్యం ఉండగా… నిర్ధేశించిన లక్ష్యం కంటే అత్యధికంగా రుణాలిప్పించినట్లు వివరించారు. గతేడాది 2,72,112 స్వయం స్వశక్తి సంఘాలకు రూ. 10,310.90 కోట్ల రుణాలిప్పించామని, వాయిదాలు చెల్లించడంలో మన రాష్ట్ర మహిళలు దేశంలోనే నెంబర్వన్స్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రుణాల లక్ష్యాన్ని బ్యాంకుల వారీగా పంపించామని, నిర్ధేశించిన రుణ లక్ష్యాన్ని అమలు చేయడంలో సిబ్బంది సమాయత్తం కావాలని సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశాలు జారీ చేశారు.

0 Comments