Wanted Reporters

Wanted Reporters

ప్రగతి భవన్ చేరిన సీఎం కేసీఆర్.. కాసేపట్లో కరోనా పై రివ్యూ

 ప్రగతి భవన్ చేరిన సీఎం కేసీఆర్.. కాసేపట్లో కరోనా పై రివ్యూ


హైదరాబాద్ తెలంగాణ సాక్షి న్యూస్ :
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి కిందటే హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇన్నిరోజులు కరోనా బారిన తన వ్యవసాయ క్షేత్రంలోని ఫాంహౌస్‌లో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో కేసీఆర్‌కు నెగెటివ్ రావడంతో ఆయన గురువారం ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. కాసేపట్లో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆరోగ్యశాఖ సీఎం దగ్గర ఉండటంతో ఆయన రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా హైకోర్టు ఆదేశాల మేరకు వీకెండ్ లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటారా లేదా నైట్ కర్ఫ్యూతోనే సరిపెట్టనున్నరా అనేది తేలాల్సి ఉన్నది. 

Post a Comment

0 Comments

Ad Code