వాస్తవ తెలంగాణ రామగుండం నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 1: 29 10 23 రోజు రాత్రి రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలో మల్యాలపల్లి సబ్ స్టేషన్ సమీపంలో జరిగిన హత్య కేసు నిందితులను 48 గంటలు తిరక్కముందే రామగుండం పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మల్యాలపల్లి సబ్ స్టేషన్ కి సమీపంలో తేదీ 29_ 10_23 రాత్రి సమయంలో మెయిన్ రోడ్డు పక్కన సైడ్ కెనాల్ లో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడని సమాచారం మేరకు రామగుండం ఎస్సై వెంకటేష్, సీఐ చంద్రశేఖర్ గౌడ్, ఏసీపీ తులా శ్రీనివాసరావు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టి ఆనవాళ్ళ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. చనిపోయిన వ్యక్తి లావుడ్య మధుకర్ (30) సింగరేణి కార్మికుడు 8 ఇంక్లైన్ కాలనీ గా గుర్తించారు. మరుసటి రోజు ఉదయం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేయగా నిందితుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడి మధుకర్ భార్య రమ తన అక్రమ సంబంధానికి అడ్డు ఉన్నాడనే నేపథ్యంలో అతని ప్రియుడు గోవర్ధన్ తో కలసి ఒక పథకం ప్రకారం తన స్నేహితులు నాగరాజు, లక్ష్మణ్ తో కలిసి ఒక పథకం ప్రకారం హత్య చేశారని బుధవారం వివరాలను ఏసీపీ వెల్లడించారు.

0 Comments