ఓటు హక్కుపై కళాకారుల కళాజాత ప్రదర్శన...
వాస్తవ తెలంగాణ, నవంబర్ 1, పెద్దపల్లి ప్రతినిది: ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సాంస్కృతిక సారథి కళాకారులచే కళాజాత ప్రదర్శన నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశాల మేరకు రామగుండం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి అరుణశ్రీ ఆధ్వర్యంలో జిల్లా సాంస్కృతిక సారథి కళాకారులచే స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఓటు హక్కు సద్వినియోగం పై విస్తృతంగా అవగాహన కల్పించడం జరుగుతున్నది.
ఇందులో భాగంగా బుధవారం రామగుండం మజీద్ కార్నర్, రామగుండం రైల్వే స్టేషన్, అన్నపూర్ణ కాలనీ, దుర్గయ్య పల్లె స్కూల్ వద్ద ఓటు హక్కు అవగాహన పైన తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే ఆట, పాట నిర్వహించి ఓటర్లను చైతన్యపరిచి, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓ స్వరూప రాణి, మెప్మా పీడీ డైరెక్టర్ రజని, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఈదునూరి పద్మ, దయా నర్సింగ్, జనగామ రాజనర్సు, జిన్నా రమాదేవి, బుర్ర శంకర్ గౌడ్, సానగొండ రవీందర్, మంథని వెంకటస్వామి, జక్కుల స్వప్న, మంథని స్పందన, జేన్నే శ్వేత, ఉప్పు స్పందన, తదితరులు పాల్గొన్నారు.

0 Comments